Saturday, March 6, 2010

స(వ)న్ DAY ప్రేమ కథ

ఆదివారం కావటం తొ అలవాటు ప్రకారం  పదకొండు వరకు  పడుకుందాం అనుకుంటే పొద్దునే ఫొన్ చెసాడు  సుమధుర్ . అరేయ్ తొందరగా రారా, మా ఇంటి  దగ్గర కొత్తగ ఒక అమ్మాయి వచ్చింది ఆప్సరసలా వుంది అన్నది వాడీ ఫొన్ కాల్ సారాంశం.సమయం పావు తక్కువ తొమ్మిదైంది. మంచం మీద నుంచి దిగాలని లెకపొయినా అమ్మాయీ అన్న నా చిన్న వీక్నెస్ మీద కొట్టె సరికి పది నిమిషాల్లొ ఇంట్లొ నుంచి బైక్ తీసుకొని బయటపడ్డాను.
సుమధుర్ నేను చిన్నప్పటి  స్నేహితులం అన్నిట్లోను వాడు నాకన్న ముందె, ఒకే స్కూల్ అయిన నేను బి సెక్షన్ అయితె వాడు ఏ సెక్షన్. (వాళ్ళ నాన్న కి ప్రిన్సిపల్ తొ ఉన్న పరిచయం తొ నాకన్న పై సెక్షన్ లొ ఉండాలని వాడు అలా వెయించుకున్నాడు అని అప్పట్లొ రుమొర్ ఉండెది ) ఇంటర్ లొ కూడ ఒకే కాలెజ్. కాని నెను 302 వాడు 301. ఆ పరంపరను కొనసాగిస్తు వాడు, నెను బిట్స్ కి వచ్చాను అని, వాడు హైదరాబాద్ లొ  ఉన్న(కేవలం 50కి.మి  దూరం) VITS అనే ఇంజీనీరింగ్ కాలెజ్ లొ చెరాడు, అంత స్నేహం మాది. కాని ఇద్దరికి ఇన్ని సారుప్యలు ఉన్న ఒక్కటె తేడ. వాడికి అమ్మయిలు చాలా మంది తెలుసు, నాకు తెలిదు. వాడి కాలెజ్ వాల్లే కాదు, అటు పక్కన ఉన్న UITS ,ఇటు పక్కన ఉన్న WITS ఇలా ప్రతి కాలెజ్ వాళ్ళూ వీడికి తెల్సు, కాదు కాదు వాళ్ళకి వీడు తెల్సు. వాడిని అంత మంది అమ్మాయిలతొ చుసినప్పటి నుంది ఎలాగైన ఒక అమ్మాయిని పడెయాలి అన్నదె నా ధ్యెయం,నా మార్గం. కాని ఎవరు తెలియకపొవటం తొ  వాన లేని ఎండ లాగ అయిపొయింది నా పరిస్థితి (దానికి అర్థం నాకు కూడ తెలిదు.మీరు అలొచించకండి).
ఇంతలొకి సుమధుర్ ఇల్లు రానె వచ్చింది .వాడు ఇంటి లోపలకి రమ్మన్నా వెళ్ళకుండా ముందు అమ్మాయిని చూపించు అన్నాను.వచ్చిందే అందుకు కద..వీడు ఇచ్చె నీళ్ళ లాంటి టీ, ఉప్పు రాళ్ళ లాంటి బిస్కెట్స్  కోసం కాదు ..... వాడు తాపీగ.అమ్మాయి లేదు వాళ్ళ అమ్మ లేదు. అలా చెబితేనే  నువ్వు  వస్తావని నాకు తెల్సు..అందుకే అలా చెప్పాను అని తెలుగు సినిమాలొ విలన్ కి డబ్బింగ్ చెప్పె ఆర్టిస్ట్ లాగ ఒక నవ్వు నవ్వాడు. నాకు నిజంగానె వాడు విలన్ లా తెర్రరిస్ట్ లా కనిపించాడు. కాని వాడిని ఏమి చెయ్యలేని నా దెహ దారుడ్యం మీద జాలి వేసి వాడిని వదిలెసాను. ఇంటికి వెళ్ళిపొదామనుకుంటూ,  మరి ఎందుకు రమ్మన్నావు అని అడిగాను,  “కాలెజ్ లొ సెమినార్ ఉంది. నా బైక్ పాడైంది. నువ్వు ఎలాగు కాలీగానె  ఉంటావ్ కదా నీకు గాలి తగిలినట్టుంతది నన్ను తెసుకువెళ్తావ్ అని రమ్మన్నా “అని అసలు విషయం బాంబులు పేలిన ఆరు నెలలకు ఉగ్రవాది ఉహాచిత్రం గీసే పోలిస్ లా అసలు విషయం మెల్లగ చెప్పాడు.నాకు మొసం చెసిన వాడిని నా బైక్ ఎక్కించుకుంటాన అని అలొచిస్తున్న నాకు ఒక ఐడీయా తట్టింది, సరె వస్తాను అని చెప్పాను. వీడి కాలెజ్ లొ అమ్మాయిని పట్టేస్తె అయిపొతుంది కదా అన్నది నా అలోచన. అమ్మాయి గురించి వివరాలు కావలంటె తెలుస్తాయీ సుమధుర్ ద్వారా అన్న ఆనందం తొ ఒక్క రొజు జీతం లెని డ్రైవర్ గా నన్ను నేను నియమించుకున్నాను.




కాలెజ్ చేరుకునే సరికి పదకొండున్నర అయింది. అమ్మయి అన్న తొందర్లో అల్పహారం కూడ చెయ్యకపోయె సరికి కడుపులొ ఏనుగులు పరిగెత్తుతున్నాయ్(ఎలుకలు మరి చిన్నవి ఐపొతయెమొ అనిపించింది). వాడిని లొపలికి వెళ్ళమని ఆ కాలెజ్ లొ క్యాంటీన్ అని అందరిచే పిలవబడుతున్న ఒక చిన్న పాడుబడ్డ కుటీరం లొ అడుగుపెట్టాను. లోపల థియేటర్ దగ్గర టికట్ ల కొసం కొట్టుకునే జనంలాగా ఎగబడుతున్నారు అక్కడ దొరికే ఎకైక ఐటం స్పెషల్ దోశ కొసం. సరె ఏదొ ఒకటి లాగించేస్తె వచ్చిన పని కానియ్యచ్చు అని ఆ వెరీ వెరీ స్పెషల్ దోశ నే  తీసుకున్నాను. అందరు ముద్దుగా పిలుచుకుంటున్న ఆ సగం కాలిన స్పెషల్ దోస, మిగతా వాళ్ళు (ఆ కాలెజే అనుకుంటా) దొరికిందే బాగ్యం గా ఎంజాయ్ చెస్తు తింటున్న ఆ స్పెషల్ దోశ తినలెక పడేసాను. అదే పడెయలేక తినెసాను.

ఆ క్యాంటీన్ అని పిలవబడె దాని నుండి బయటకీ వస్తుంటే “Excuse ME “ అని వినపడింది..గొంతు అమ్మాయిది కావటం తొ నా ప్రమేయం లెకుండానె నా కళ్ళు అటు వైపు తిరిగాయి,ఎవరా అని చుడ్డానికి......అంతె ఒక్కసారి మొహం వెలిగిపొయింది .అనుకొకుండా వెళ్ళిన బాలయ్య బాబు సినిమా మధ్యలొ ఆగిపొతే వేసే సంతొషం అంత.. ..చాన్స్ ఇస్తె చెలరేగిపొయే లా ఉన్న నా ముఖం మీద భావాలను పసిగట్టిన ఆ అమ్మయి..భయపడిందో ,జాలిపడిందొ అక్కడి నుండి మాత్రం నాకు కనిపించకుండా వెళ్ళిపొయింది..ఇక ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినె ప్రేమించాలి అని నా మనసు తెలుగు సినిమాల్లొ లాగ నాకు వినపడేల  గట్టిగా చెప్పింది..ఎక్కడకీ వెళ్ళివుంటుందా అని వెతుకుతూ ఉంటే ఆ కాలెజ్ కంప్యూటర్ ల్యాబ్ లొ వెళ్ళటం గమనించాను.అసలు సమయం వౄధా చేయకుండా నెను కూడ వెళ్ళిపొయాను. లోపల ఎప్పుడో కంప్యూటర్ కనుకున్నప్పటి డబ్బాలను పెట్టేసి దాన్నె ల్యాబ్ అంటున్నారు అని అర్థం అయింది..మొత్తం ల్యబ్ అంత కాలిగా ఉంటే నెను వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాను. నన్ను ల్యాబ్ ఇంచార్జ్  రాజకియానాయకులని చూసినట్టు హీనంగా చూసి వెళ్ళిపొయాడు.. కాని మన నయకుల్లానే అసలు సిగ్గూ పడకుండా (సిగ్గు లెకుండా అని) అక్కడే కూర్చున్న నెను బిట్స్ అన్న విషయం తేలిస్తె ఒక ఇంప్రెషన్ పడిపోతుంది కదా అని ఆలొచించి, ఆమెకి అదే తెలియడానికి ఒక ప్లాన్ వెసాను..బిట్స్-పిలాని సైట్ తెరిచి తను చుసేలా చెయాలి ..కాని తను చుడట్లేదు అని గమనించీ, చూసేల చేయడానికి అని  పెన్ అడిగాను..పెన్ ఇవ్వబొతూ నా కంప్యూటర్ వైపు చుసి కొంచెం అటు ఇటు గా ఇందాక ఇంచార్జ్ చూసిన చూపు చుసి, అక్కడ నుండి వెళ్ళిపోయింది ..అల ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక నెను కంప్యూటర్  చుస్తే ఎలా ఒపెన్ అయిందో కాని జన రంజకమైన సైట్ ఒపెన్ అయిందీ..దానిని చుసే ఆ అమ్మాయి బెదిరిపొయి పారిపోయినట్టుంది..ఇది పిరికిపందల చర్య..దీన్ని నేను ఖండిస్తున్నాను లాంటి  దాడులు అయినప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ ఇద్దాము అనిపించింది..కాని తను వెళ్ళిపొతుంది అని గ్రహించి తన వెంట వెళ్ళాను..( నేను కొట్టలనుకున్నది కాకుండా నా చేతి వెళ్ళు, వాటికి బాగా అలవాటు ఐనా దాన్నె కొట్టడం ద్వారా ఆ సైట్ ఒపెన్ అయింది అన్నది ఇక్కడ అప్రస్తుతం..తప్పు నాది కదు నా చెతి వెళ్ళది అన్నది విషయం)..

ఇక అక్కడి నుండి తన సెమినార్ రూం కి వెళ్ళాను..తనది వినాలని ఆగడం తొ..ప్రతి ఒక్కడు చెప్పే సోది లాంటి ప్రెజెంటేషన్స్ లేక ప్రెజెంటేషన్స్ లాంటి సోది వినాల్సి వచ్చింది..ఎప్పటికో రెండు గంటల తరువాత అవకాశం రావటం తొ  ఆ అమ్మాయి చెప్పడానికి వెళ్ళింది..నేను ఆ అమ్మయిని చూడటం తప్పితె తను చెప్పే విషయం మీద ధ్యాస పెట్టక పొవడం తొ నాకు ఆ ప్రెజెంటేషన్ తెగ నచ్చేసింది. తను నాకు ఒక మేడం క్యురీ లా , ఒక మిస్ అబ్దుల్ కలాం ఇలా ఎవేవో అనిపించింది..తను ఎదొ చెబుతు మద్యలొ ఆపెయడం తొ ఇంత త్వరగా అయిపొయిందా అని కూడా అలొచించకుండా విరగబడీ మరీ చప్పట్లు కొట్టాను. అంతె తను,తన స్నెహితులు, ఆ రూం లొ  ఉన్న వాళ్ళందరూ నన్ను ఈ సారి రజకీయ నయకుడీలా కాక,తండ్రి పేరుతొ ఎదగాలనుకునే రజకీయ నాయకుల పుత్రులను చూసినట్టు చూసారు..ఆ అవమానం తొ బయతపడ్డ నెను ఆ అమ్మయి ముందు అయ్యాను అని మాత్రం అర్థం అయింది..ఒక్క సారిగ క్యంపస్ మొత్తం నకు బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. ఐ.ఐ.టి కోసం చదివితె లొకల్ ఇంజినీరింగ్ కాలెజ్ లొ సీట్ వచ్చినట్టు అయింది నా పరిస్థితి.

ఇక చేసేదేమి లేక ఆఖరి ప్రయత్నంగ సుమధుర్ గాడిని రంగం లొకి దించాలి అని అయిష్టంగానె వాది దగ్గరకు వెళ్ళాను..వెతగ్గ వెతగ్గ ఒక అమ్మాయిల గుంపులొ మధ్యలో నిలబడి ముచ్చటిస్తూ దొరికాడు (ఆ గుంపును చూసాక,మద్యలొ వాడిని చూసాక, నేను హైదరాబాద్ లొ ఎందుకు ఇంజినీరింగ్ ఎందుకు చదవట్లెదు అని జీవితం లొ బాదపడ్డ నూట తొంబైయ్యో సారి) వాడిని ఆ గుంపు నుంచి బయటకి తీసి,జరిగినదంతా చెప్పి సహాయం చేయమని అడిగాను.
వాడు అలవాటు గా  ”ఈ రోజు ఈ అమ్మయి అంటవ్..రేపు ఇంకొ అమ్మయి అంటావ్..పోయెదీ నా పరువే..పరిచయం చెస్తె చాటింగ్ చేస్తున్నట్టు..హెలొ ఏ.ఎస్.ఎల్ ప్లీజ్ అనే టైప్ రా నువ్వు..నేను రాను” అన్నాడు..అంతక రెండు రోజుల ముందే చాటింగ్ లొ పరిచయం అయినా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడం తొ వాడు అలా అడిగాడు అనిపించింది..
నేను: ”అరె అలా అనకు రా..ఈ సారి మాత్రం నాది నిజమైనా ప్రేమ ”
వాడు: ”ఇదీ ఎన్నో నిజమైన ప్రేమ రా??”
నేను ”అరె ఇప్పటివరకూ ఖచ్చితంగా తెలీదు  …కాని ఇదీ మాత్రం పక్క..”
వాడు ”అయినా తను ఎవరొ కూద తెలియకుండా ఎలా ప్రేమిస్తావ్ ??”
నేను  (ఏ సినిమా డైలాగో తెలీదు కాని చాల సార్లు ఉపయొగించిన అనుభవం తొ)” తనను చూసి ప్రేమించట్లేదు..తను ఎలా ఉంటె నాకేంటి..తన క్యారక్టర్ నచ్చింది..అందుకు ఇష్టపడుతున్నా..నీ ఇష్టం సహాయం చేస్తె చెయ్యి..లేకుంటే మానెయి..నెను అయితె తన దగ్గరికీ వెళ్తున్న”
వాడు:??  “వాడికి ఇంక డైలాగ్స్ లేవు..నెను కొట్టిన తొక్కలో డైలాగ్స్ కి సెంటిమెంటల్ వీక్ అయినా వాడి గుండె కరిగిపొయినట్టుంది..చాలా ఎమొషనల్ గా వాడు సరే అనడం తొ ఆ అమ్మాయిని చూపించడానికి తేసుకువెళ్ళాను..దారిలొ అప్పటి వరకు నాకు ఎన్నొ రోజుల్నుంచి ఉన్న ధర్మ సందేహాన్ని తీర్చుకుందామని వాడినీ  “నీకు ఇంత మంది అమ్మాయిలు ఎల తెలుసు రా....నేను ఖాళి అని చెప్పినా కూడా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు..ఇంత మంది తెల్సు కదా వీళ్ళలొ ఎవరూ నీకు నచ్చలెదా అని అడిగాను వాడిని పొగిడాను అన్న ఆనందమొ..నెను వెధవను అయ్యాను అన్న సంతౄప్తో తేలీదు కానీ అప్పటివరకు ఉన్న వాది మౌనాన్ని వీడి  "ఎన్నో రొజుల నుంచి నేకు చెప్పాలి అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఉంది రా..మా కాలెజె. నీకు చుపిస్తాను ఈరోజు....తనని పరిచయం చెద్దామనే ఇక్కడికీ తీసుకువచ్చా” అన్నాడు..బైక్ లేదు అని తీసుకు వచ్చాడు అన్న విషయం నాకు గుర్తుకు రాలెదు, వాడికి కూడా ఒక అమ్మయి పడిపొయింది అన్న కడుపు మంట గుర్తుకు రానివ్వలెదు. ముందు వీడి గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చెసాక..ఆ అమ్మాయి దగ్గరికీ వెళ్దాం అని వాడు  ..కాదు ముందు నేను అని కాసెపు అసెంబ్లిలో జరిగే గొడవ లాంటి వాదన చేసుకున్నాం..ఎప్పటి లాగె వాడు నాకన్న అన్నీ ముందు కాబట్టి వాడు చూపించాకె మిగతాది అని ఒప్పుకున్నాను, ఆ అమ్మాయిని పరిచయం చేసుకొవలంటే వీడే దిక్కు అని ఒప్పుకోక తప్పలేదు.వెళ్తు ఉంటె మరో సందేహం “అరెయ్ నీకు ఆ అమ్మాయి ఎలా పరిచయం??”.. ”మా కాలెజే తనూ,,తన బెస్ట్ ఫ్రెండ్ ఇంటర్ లొ మన కాలెజే. అలా తను పరిచయం అయింది.%@%$్$$$%” ఆ తరువత ఎం చెప్పాడొ నాకు వినిపించలెదు..అర్థం కూడ కాలెదు..మొత్తం నిషబ్ధం..వాడి గర్ల్ ఫ్రేండ్ ,నేను వెంటపడ్డ అమ్మాయి  ఒక్కరే అవ్వటం తొ ఆ విరహం నుంచి బాధ..ఆ బాధ నుంచి పుట్టిందే ఈ నిషబ్ధం..
ఆన్నిట్లొను నాకన్న ముందు ఉండె వీడు,క్లాస్ సెక్షన్స్, రోల్ నంబరే కాదు..అమ్మాయిల విషయంలోను అంతె అని నాకు అప్పుడే  అర్థం అయింది. ఆ అమ్మాయిని చుడటం లోను, మాట్లాడటం లోను, ప్రేమించడం లోను అన్నిట్లోను వాడే ముందు.ఇక చెసెదేమిలెక ఆ అమ్మాయి వెళ్ళిపొయింది అని చెప్పి అక్కడి నుంది బాధపడుతూ బయటపడ్డాను..వాడు ఆ తరువాత ఎన్ని సార్లు అడిగినా నేను ఆ అమ్మయి ఎవరో చెప్పలేదు, చెప్పలేకపొయాను.దాంతొ వాడు ఆ అమ్మాయి పేరు వన్ డే ప్రేమ అని పెట్టి ఎడిపిస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించడం మొదలు పెట్టడు.అలా ఒక సండే పరిచయం అయ్యి వన్ డే ప్రేమగా మిగిలిపొయింది ఆ అమ్మాయి..
ఆ తరువత  రెండు ఏళ్ళకు వీళ్ళు విడిపొయారు అని కొంత మంది స్నెహితుల ద్వారా  తెల్సుకొని నేను ఎంతో ఆనంద పడ్డాను!!! ఆ అమ్మాయి  ని మళ్ళి కలవాల్సిన అవసరం ఉందదు అని!!!
ఇంతకి ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ!!!

Sunday, March 29, 2009

ఇప్పటివరకు చదివి చదివి అలిసిపొయిన నెను ఇక చదవటం నా వల్ల కాదని డిసైడ్ అయిపొయను....ఇక అదంతా ఆపేసి జీవితం లొ సెటిల్ అయిపొదాం అనిపించింది.. ఎవడొ పనికి రాని వెధవ సెటిల్ అవ్వడం అంటె ఉద్యోగం రావడం , బాగా సంపాదించదం అని చెప్పాడు..కాని దాని అర్ధం ఒక అమ్మాయిని పడెయటం అని తెల్సుంటె ఇన్ని కష్టాలు ఉండెవి కావు కదా..ఎ ఐదవ తరగతిలొనో...... ఏనిమిదో తరగతిలొనో ఐ లవ్యూ అని చెప్పేసి హాయిగ సెటిల్ అయిపొయెవాడిని...అది తెలీక టెన్త్ లొ తొంభై శాతం మార్కులు కొసం ట్రై చెసి ఎనభై శాతం సెటిల్ అయిపొయి...ఇంటర్ లొ ఐ ఐ టి కొసం ట్రై చేసి బిట్స్-పిలాని అనె ఎడారిలొ సెటిల్ అయిపొయె బాధ ఉండేది కాదు కద.. ఎడారిలొ అంటే నీల్లు లేని ఎడారైన పర్లేదు....బిట్స్ లొ కూడ ఎడార్లొ ఒయాసీస్ ఉన్నట్టు ఇక్కడ అమ్మాయిలు ఉంటారు...బాగున్న కొంత మంది 10 తరగతి లొనో ఇంటర్ లొనో సెటిల్ అయిపొయి వుంటారు... మిగిలిన కొంతమందిని ఇంక మిగిలిన వాల్లని ట్రై చేసిన పెద్దగా ఉపయొగం ఉండదు నా లాంటి వాల్లు ఇగో ని సంతౄప్తిపరచటం కోసం అందమైన అమ్మాయి కోసం వేచి చేస్తు ఉంటారు.. రెండేళ్ళు బిట్స్ లొ ఉన్న తరువాత అప్పుడు అర్ధమైంది Orkut ఒపెన్ చెయ్యాలి అని....ఏప్పుడొ ఇంటర్ లొ ఒపెన్ చేసి ఎందుకు పనికి రాదు అనుకున్న Orkut ఇలా నా వేట కోసం పనికొస్తుంది అని నేను అనుకొలేదు.. ...చుస్తే 33 ఫ్రెండ్స్ ..3 కమ్మ్యునిటీస్..అప్పుడు గుర్తుకువచ్చింది ఒక సినిమా డైలాగు ......నలుగురిని సెలెక్త్ చెయ్యి ..ముగ్గురిని ట్రై చేసి...ఇద్దరిని లవ్ చెయ్యి..ఒకరితొ సెటిలైపో అని.. నెను ఆ డైలాగుని కొంచెం మార్చుకొని ఎంత మందిని సెలెక్త్ చెసిన ముగ్గురితొ మాత్రం సెటిల్ అయిపొదాం అని డిసైడ్ అయిపొయను...ఇంకా ఎక్కువ అమ్మాయిలు వస్తే అది వాళ్ళ అదృష్టం అని కూడా అనుకున్నాను.. కమ్మ్యునిటీస్ ఒపెన్ చేసి అందులొ పేరు బాగుండి..నాకు సరిపొయె ఒక 10 మందికి స్ర్కాప్స్ పంపించాను..అందరికి ఒకటె మెసేజ్ "హై ..హౌ ఆర్యు ??" అని ..వీళ్ళతొ ఆగిపోతె బాగొదు అని నా ఫ్రెండ్ అకౌంట్ ఒపెన్ చేసి అందులొ ఉన్న అమ్మాయిలకు.. వాల్లు బాగుంటారు అని ఏవొ లెక్కలు వేసుకొని వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను..ఇక్కడ కుద అదే సందేశం "హై ..హౌ ఆర్యు ??" మూడు రొజులు ఆగాక 3 సంవత్ర్సాల నుంచి 33 గ ఉన్న నా ఫ్రెండ్స్ జాబితా ఒక్కసారిగా 36 కి పెరిగింది.. అనుకునట్టే ముగ్గురి తొ సెటిల్ అయిపొతున్నామన్న ఆనందం వేసింది.. ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలకి దూరం అయ్యి ఇన్నాళ్ళు ఎల బతికాను అనిపించింది..ఇప్పటికీ ఈఆనందాలకి దూరం అయ్యి చదువులో బతికె నా ఫ్రెండ్స్ ని చూసి జాలి వేసింది.. నన్ను చూసి నెర్చుకోండి అని చెబుదాం అనుకున్నా...కాని వీళ్ళు ఆ అమ్మాయిలకె స్ర్కాప్స్ పంపితే ఇంకేముంది కథ మళ్ళీ మొదటికి వస్తుంది అని ఆగిపొయను.....స్ర్కాప్స్ తో మొదలైన పరిచయం..యాహూ మెసెంజర్ కి మారి...గూగుల్ టాక్ కి అప్ గ్రేడ్ అయింది.. ...పెద్దగ ఉపయొగం లెదు అనుకున్న గూగుల్ టాక్ ఇంతగా ఉపయొగ పడుతుందా అని అనిపించింది...ఇక అప్పటివరకు ఉన్న ఒక తొక్కలో కోతి బొమ్మని తీసి నా ఫొటో పెట్టాను...వాల్లు చూసి నేను ఎలా ఉన్నానొ తెల్సుకుంటరాని.. ఆ ఫొటొ కోసం మూడు రొజులు ..ఎక్కడెక్కడొ ఫొటోలు దిగి అన్నిటికంటె మంచిది సెలెక్త్ చెసుకొని ఆ కొతి బొమ్మనీ మార్చాను...ఇక నా ఫొటొని చూసి వాల్లంత వచ్చి ఓళ్ళొ వాల్తారు అనిపించింది..........ఫొటొ ని మార్చిన నాకు పెద్ద పంచ్ వెసి వెళ్ళాడు నా ఫ్రెండ్ ...వాడు నన్ను Gtalk లొ పింగ్ చేసి
“ఒక కొతి బొమ్మను తీసి ఇంకొ కొతి బొమ్మను పెట్టావెంటిరా???!!!”